స్వామి పరిపూర్ణానందకు ఊరట

హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందకు ఊరట లభించింది. స్వామిపై నగర బహిష్కరణ విధిస్తూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్‌లు నెల రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. స్వామిపై నగర బహిష్కరణ ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్ పోలీసులు తొలుత ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ విధించారు. ఆ తర్వాత కత్తి మహేశ్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రికి ర్యాలీ తలపెట్టడంతో స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించారు. స్వామిని కాకినాడలోని శ్రీ పీఠంకు తరలించారు.

స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించడానికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పి, హిందూ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలకు దిగారు. కేసీఆర్ సర్కార్ తీరును నిరసించారు.

ఎట్టకేలకు హైకోర్టు బహిష్కరణ ఎత్తివేయడంతో స్వామి పరిపూర్ణానంద కాకినాడ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. స్వామి అభిమానులు, హిందూ సంస్థల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*