2050కి ఏపీ అత్యున్నత స్థానంలో నిలబడాలి: చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా: జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జాతి పునర్నిర్మాణానికి అంతా కృషి చేయాలన్నారు. 2029కి ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2050కి ఏపీ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబడాలన్నారు. ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ముందుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు.

సీఎం చంద్రబాబు ప్రసంగం:

– అన్ని జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది లక్ష్యం
– ఇప్పటివరకు కర్నూలు, విశాఖ, అనంతపురం, తిరుపతిలో నిర్వహించుకున్నాం
– ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్నాం
– జాతీయ వీరుల త్యాగాలను మనమంతా స్మరించుకోవాలి
– జాతి పునర్నిర్మాణానికి మనమంతా కృషి చేయాలి
– వీరులకు జన్మనిచ్చిన జన్మభూమి ఇది
– ఆయా రంగాల్లోని సుప్రసిద్ధుల్లో చాలా మంది సిక్కోలు బిడ్డలే
– ఈ ప్రాంతానికి ఎనలేని సేవలందించిన వ్యక్తి ఎర్రన్నాయుడు
– ఎన్టీఆర్ గుండెచప్పుడు శ్రీకాకుళం జిల్లా
– ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
– వర్షాన్ని లెక్కచేయకుండా పరేడ్ నిర్వహణ అభినందనీయం
– సంకల్ప బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు
– అప్పట్లోనే విజన్ 2020ను అమలు చేశాం
– ఆర్థికాభివృద్ధి కోసం ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి చేసే ఆదాయాన్ని పెంచాం
– వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వరి దిగుబడులు పెంచాం
– మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాం
– ఆర్థిక శక్తినిచ్చే విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం
– పట్టుదలకు మారుపేరు తెలుగుజాతి, అపజయం ఎరుగనిది
– ఇవాళ విజన్ 2050 తయారుచేసుకున్నాం
– సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి
– విభజనలో అన్యాయం జరిగినా అభివృద్ధిలో ఎక్కడా ఆగలేదు
– నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించాం

సీఎం చంద్రబాబు ప్రసంగం:

– పేదవారికి అండగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేపట్టాం
– రైతులకు రూ.24,500 కోట్లు రుణవిముక్తి కల్పించాం
– పిల్లలకు ఆరోగ్యం బాగుండాలని మధ్యాహ్న భోజనం తీసుకొచ్చాం
– కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా అడుగడుగునా అడ్డుపడుతోంది
– ఎక్కడా అధైర్యపడకుండా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం
– నాలుగేళ్లలో రెండంకెల వృద్ధి రేటు నమోదు చేశాం
– డ్వాక్రా సంఘాలకు రూ.10 వేల కోట్లు ఆర్థిక సహకారం అందించాం
– విద్య, వైద్య సదుపాయాలను బాగా అభివృద్ధి చేశాం
– అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం
– ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం
– కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాం
– వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ఉపప్రణాళిక తీసుకొచ్చాం
– ఆదరణ పథకం ద్వారా కులవృత్తులకు అండగా నిలుస్తున్నాం
– రూ.750 కోట్లతో ఐదు లక్షల మందికి పనిముట్లు
– చేనేత కార్మికులకు రూ.110 కోట్లు రుణమాఫీ చేశాం
– వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్
– కాపు రిజర్వేషన్ ఏర్పాటుకు ఏటా రూ.1,000 కోట్లు
– రూ.26 కోట్లతో జిల్లాకు ఒక కాపు భవనం

సీఎం చంద్రబాబు ప్రసంగం:

– అన్న క్యాంటీన్లు చాలామందికి ఉపయోగపడుతున్నాయి
– కూలి పనులు చేసుకునేవారికి అన్న క్యాంటీన్లు ఉపయోగపడుతున్నాయి
– రూ.50 వేల కోట్ల వ్యయంతో 19 లక్షల గృహాల నిర్మాణం
– గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం
– పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం
– పేదలకు కట్టించే ఇళ్లకు సమీపంలో ఎకనమిక్ సిటీలు అభివృద్ధి చేస్తున్నాం
– నాలుగు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం
– మాతాశిశు మరణాలను పౌష్టికాహారంతో తగ్గిస్తున్నాం
– పేదల ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం
– ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం
– ఉద్దానం సమస్య మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం
– సీఎం సహాయనిధి నుంచి రూ.1,000 కోట్లు విలువైన వైద్యసాయం అందించాం

సీఎం చంద్రబాబు ప్రసంగం:

– ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, అన్ని వర్గాల ప్రజలకు 72వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
– పట్టుదలకు మారు పేరుగా ఈరోజు 72వ స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి
– చరిత్రలో శాశ్వతంగా గుర్తుంటుంది
– రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం
– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఎర్రకోటపైనా, రాష్ట్రాల్లో రాజధానిలో జరుపుకుంటారు
– కానీ విభజన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి
– అన్ని జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి కావాలి
– స్వాతంత్ర్యం ఫలితాలు అందరికి అందాలన్న ఉద్దేశంతోనే జిల్లాల వారీగా వేడుకులు జరుపుకుంటున్నాం
– ఇప్పటివరకూ కర్నూలు, విశాఖ, అనంతపురం, తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం
– ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరుపుకోవడం ఒక చరిత్ర – ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం

సీఎం చంద్రబాబు ప్రసంగం:

– మన నేటి స్వేచ్ఛకు మూలధనం స్వాతంత్ర్యం
– స్వాతంత్ర్య పోరాట వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత
– పోరాట వీరుల స్ఫూర్తితో భవిష్యత్తు వైపు సాగిపోవడం మన కర్తవ్యం
– జాతీయ వీరుల త్యాగాలను మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది
– జాతి పునర్నిర్మాణానికి మనందరం పునరంకితం కావాలి
– దేశం అంటే మట్టికాదోయ్.. దేశామంటే మనుషులోయ్ అన్నాడు మన గురజాడ
– మన భూమి, మన జలం, మన జనమే మనకు సంపద..
– వీటిని సద్వినియోగం చేసుకోవడానికి స్ఫూర్తి ఉండాలని కోరుకుంటున్నారు
– వీరులు పుట్టిన గడ్డ శ్రీకాకుళం
– ఈనాడు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఎందరో సైనికుల పురిటి గడ్డ శ్రీకాకుళం
– పర్యాటక రంగానికి మణిహారం శ్రీకాకుళం జిల్లా
– 194 కి.మీ సముద్ర తీరం సిక్కోలుకు ఉన్న సంపద

సీఎం చంద్రబాబు ప్రసంగం:
– ఎన్టీఆర్‌ను టెక్కలి నుంచి గెలిపించి, ఆదరించింది శ్రీకాకుళం జిల్లా
– ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని వేళలా అగ్ర తాంబూలం వేస్తాం
– ఈరోజు హిర మండలం రిజర్వాయర్‌లోకి నీరు తెచ్చుకున్నాం
– మనందరం నాడు, నేడు, రేపును గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది
– స్వతంత్ర జీవులుగా మనం జీవిస్తున్నాం
– సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధిస్తామనే నమ్మకం ఉంది
– 1995-2004 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి సమైఖ్యఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేశాను
– అప్పట్లోనే విజన్ 2020 తయారు చేసి దానిని అమలు చేశాం
– ఆర్థిక అభివృద్ధి కోసం ఆర్థిక సంస్కరణలను అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ఆదాయాన్ని పెంచాం
– వ్యవసాయరంగంపై శ్రద్ధ పెట్టాం

సీఎం చంద్రబాబు ప్రసంగం:

– ఎకరాకు 2,600 కేజీల దిగుబడి ఉండే వరి
– ఇప్పుడు 3,100 కిలోలకు పెరిగింది
– మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాం
– ఆర్థిక శక్తినిచ్చే విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశా
– విద్య, వైద్య, మానవ వనరుల అభివృద్ధి కోసం కృషి చేశాం
– విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకువచ్చాం
– 10ఏళ్ల పాటు అస్థ వ్యస్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది
– ఒక పద్దతి లేని విభజనతో కట్టుబట్టలతో తెలంగాణను వదిలి ఆంధ్రకు వచ్చాం
– 60 ఏళ్ల పాటు హైదరాబాద్‌లో ఉండి మనందరం కష్టపడి పని చేసాం
– మళ్లీ ఈరోజు కొత్త రాష్ట్రం నవ్యాంధ్ర ప్రదేశ్‌ను నిర్మాణం చేసుకుంటున్నాం
– పట్టుదలకు మారుపేరు తెలుగుజాతి, అపజయం ఎరుగనిది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*