
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఘటనతో షాక్‌కు గురైన పోలీసులు మంటలను ఆర్పేశారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని కేర్ ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లో కెళ్తే:
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5 లోని దేవరకొండ బస్తీకి చెందిన మనోజ్ కుమార్తె వివాహం ముషీరాబాద్‌కు చెందిన సతీశ్‌తో ఇటీవలే జరిగింది. ఇంతలోనే భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో మనోజ్ కుమార్తె పుట్టింటికి వచ్చింది. దీంతో నిన్న సతీశ్ తల్లి, తమ్ముడు ఇతర బందువులు వచ్చి దేవర కొండ బస్తీలోని మనోజ్ ఇంటి వద్ద గొడవకు దిగారు. దీనిపై మనోజ్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న సతీశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే అత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మామ మనోజ్ తన అల్లుడు బెదిరింపుల విషయం గురించి చెప్పారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్‌కు బైక్ పై వచ్చిన అల్లుడు సతీశ్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. ఉలిక్కిపడిన పోలీసులు, అక్కడే ఉన్న ఇతర వ్యక్తులు మంటలు ఆర్పేశారు. సతీశ్‌ను కేర్ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ కలహాలతో సతీశ్ పీఎస్ ముందు ఆత్మహత్య యత్నం చేసాడని చెప్పారు. ఫిర్యాదుపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించకుండానే.. పోలీస్ స్టేషన్‌కు రాక ముందే సతీశ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెప్పారు.
ఆత్మహత్యాయత్నం ఘటనతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Be the first to comment