
హైదరాబాద్: పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్లు ఉడుస్తున్న పారిశుధ్య కార్మికురాలి పైకి రెయిన్ బజార్ పోలీస్ పెట్రోలింగ్ రక్షక వాహనం దూసుకెళ్లింది. వాహనం నెంబర్ TS 09 PA 2211. మృతురాలిని సాయమ్మగా గుర్తించారు. ఆమె వయస్సు 50 సంవత్సరాలు. సింగరేణి కాలనీ నివాసి. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
సాయమ్మ కుటుంబంలో విషాదం నెలకొంది. తోటి కార్మికురాలు కళ్ల ముందే చనిపోవడంతో పారిశుధ్య కార్మికులు షాక్కు గురయ్యారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Be the first to comment