
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Unfurled the Tricolour flag at our residence on the occasion of Independence Day #MeraBharatMahaan #JaiHind#VandeMataram #IndependenceDay2018 pic.twitter.com/sS5bwjKPVt
— Lokesh Nara (@naralokesh) August 15, 2018
తన అర్ధాంగి నారా బ్రహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్‌తో కలిసి ఆయన జాతీయ పండుగను జరుపుకున్నారు. జెండా ఆవిష్కరణకు ముందు అందరూ మహాత్ముడి చిత్రపటానికి నమస్కరించారు.
అంతకు ముందు నారా లోకేశ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు ట్విటర్ ద్వారా నివాళులర్పించారు.
On #IndependenceDay2018, let’s commemorate the sacrifices made by our founding fathers who didn’t think twice to lay down their lives so we could live a life blessed with freedom. Have a great day filled with spirit of patriotism. #jaihind #VandeMataram
— Lokesh Nara (@naralokesh) August 15, 2018
Be the first to comment