
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న వాజ్‌పేయి ఈ ఏడాది జూన్ 12 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వాజ్ పేయి అనారోగ్యం దృష్ట్యా బీజేపీ అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంది. ఈ మధ్యాహ్నం వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. ఈ మధ్యాహ్నం వాజ్‌పేయిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరామర్శించారు. విజయవాడ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం కూడా రద్దైంది. వాజ్‌పేయి కోలుకోవాలని అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నారు.
This post is also available in : English
Be the first to comment