
వరంగల్: ఆగస్టు 10న వరంగల్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు గడిచిన సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి సంచలన విషయం ఒకటి బయటపెట్టారు. కలెక్టర్ బంగ్లాలో దెయ్యముందని, రాత్రి పూట పడుకోవాలంటే తనకు భయమని స్వయంగా ఆమ్రపాలి చెప్పారు. బంగ్లాలోని మొదటి అంతస్థులో దెయ్యం ఉందని తనకు పాత కలెక్టర్లు చెప్పారని తెలిపారు. తనను రాత్రి వేళ అక్కడ పడుకోవద్దని సలహా ఇచ్చారని కూడా కలెక్టర్ చెప్పారు. తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మరిన్ని ఆసక్తికర సంగతులు చెప్పారు.
జార్జ్ పామర్ అనే ఇంజనీర్ భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని ఆమ్రపాలికి తెలిసింది. జార్జ్ పామర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తితో కొన్ని నెలలుగా శోధించారు. నిజాం కాలంలో ఆయనో గొప్ప ఇంజినీర్ అని తెలుసుకున్నారు. తాను బాధ్యతలు తీసుకున్నాక గదిలోకి వెళ్లి చూస్తే గదంతా చిందరవందరగా పడి ఉండడంతో దాన్ని సర్ది పెట్టించానని ఆమ్రపాలి తెలిపారు. అయినా కూడా ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతో అక్కడ పడుకోవడానికి సాహసించలేనని ఆమ్రపాలి చెప్పుకొచ్చారు.
This post is also available in : English
Be the first to comment