బతికి ఉండగానే వాజ్‌పేయికి నివాళి అర్పించిన గవర్నర్.. మండిపడ్తున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయికి బతికి ఉండగానే త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ నివాళి అర్పించారు. ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. ఇంతలోనే తేరుకుని తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఓ టీవీ ఛానల్‌లో వచ్చిన సమాచారాన్ని చూసి తాను వాజ్‌పేయికి నివాళి అర్పించానంటూ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ట్వీట్‌ను డిలీట్ చేశారు. మరో ట్వీట్ ద్వారా సారీ చెప్పారు.

మరోవైపు ఢిల్లీలోని వాజ్‌పేయి నివాసం వద్ద, పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి నివాసం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు మళ్లించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

అటు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్ తదితరులు సందర్శించారు.

వాజ్‌పేయి అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో పనిచేయడం తన అదృష్టమని నవీన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*