
న్యూఢిల్లీ: యమునా నది ఒడ్డున అటల్ బిహారీ వాజ్పేయికి మెమోరియల్, సమాధి నిర్మించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
సమాధి నిర్మించేందుకు ఉన్న అడ్డంకులు అధిగమించాలని కేంద్రం యోచిస్తోంది.
యూపీఏ హయాంలో ఢిల్లీలో స్మృతివనాల నిర్మాణాలు రద్దు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే
వాజ్పేయి విషయంలో సవరణ ద్వారా అప్పటి ఉత్తర్వుల్లో మార్పులు తేవాలని కేంద్రం యోచిస్తోంది. దీనికోసం శుక్రవారం ఆర్డినెన్స్ విడుదల చేసే యోచనలో మోడీ సర్కార్ ఉంది.
మరోవైపు ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా వాజ్పేయీ నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి వాజ్పేయి భౌతికకాయాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సందర్శకులను అనుమతిస్తారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
Be the first to comment