తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాను: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, భారత రత్న వాజ్‌పేయి పార్థివదేహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. జననాయకుడు, వక్త, ప్రభావశాలి, కవి, భరతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారి వాజ్‌పేయి యుగం అంతమైపోయిందని మోదీ చెప్పారు. సంపూర్ణంగా అబివృద్ధి చెందిన భారత్ కోసం ఆయన కలలు కన్నారని మోదీ గుర్తు చేశారు. తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయానని మోదీ భావోద్వేగంతో చెప్పారు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడంలో, సుపరిపాలన అందించడంలో వాజ్‌పేయి గొప్ప దార్శనికులని చెప్పారు.

జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ వరకు వాజ్‌పేయి ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. వాజ్‌పేయి దృఢ నిర్ణయాలు, కఠోరమైన శ్రమ వల్లే బీజేపీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందని చెప్పారు.  తీవ్ర దు:ఖాన్ని కలిగిస్తున్న ఈ సమయంలో దేశమంతా అటల్ జీ కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. వాజ్‌పేయి పాదాలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ మోదీ ఓ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

 

వాజ్‌పేయి ఆలోచనలు, ఆయన ముందు చూపు ఎప్పుడూ భారతీయులతో ఉంటాయని మోదీ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*