
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వాజ్‌పేయి కన్నుమూశారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఢిల్లీలో కొద్ది సేపటి క్రితం ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయి అరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మోదీ, షా, మంత్రులు వాజ్‌పేయి నివాసానికి చేరుకున్నారు.
మరోవైపు వాజ్‌పేయి నివాసం వద్ద, పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి నివాసం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు మళ్లించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేజీలు కూడా సిద్ధం చేశారు.
Be the first to comment