వాజపేయికి ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ : భారత రత్న, మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఘనంగా నివాళులర్పించారు.

ఎవరేమన్నారంటే!

అద్వానీ

– వాజ్ పేయి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది
– నా బాధను వ్యక్తపరచడానికి మాటలు లేవు
– తీవ్రమైన దు:ఖం, బాధతో నేనున్నా
– వాజ్ పేయిది అత్యున్నత వ్యక్తిత్వం, ఆయన తో నాకు 65 ఏళ్ల స్నేహం
– ఆర్ఎస్ఎస్ లో ప్రచారకులుగా ప్రారంభమైన మా అనుబంధం
– భారతీయ జన్ సంఘ్ లో కూడా కొనసాగింది
– ఎమర్జెన్సీ చీకటి రోజులను కలిసే ఎదుర్కొన్నాం
– జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు కలిసే ప్రయాణించాం
– మొట్టమొదటి స్థిరమైన కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వాజ్ పేయిదే
– సీనియర్ గా ఆయన ఎప్పుడూ మార్గదర్శనం చూపేవారు
– వాజ్ పేయి అద్భుతమైన వాక్పాటిమ, నాయకత్వ లక్షణాలు
– అపారమైన దేశ భక్తి అన్నింటికి మించి మానవతా విలువలు చిరస్మరణీయం
– సైద్ధాంతిక విభేదాలున్నా ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలిచే వ్యక్తిత్వం వాజ్ పేయిది
– ఐ మిస్ యూ అటల్ జీ

కేసీఆర్..
మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేసారు. ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా, మాజీ ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీర‌ని లోట‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేశారని కీర్తించారు. అట‌ల్జీ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌న్నారు.

వైఎస్ జగన్
– భారత రత్న వాజ్ పేయి మరణించారన్న వార్త ఎంతో గానే బాధించింది
– అటల్ జీ మరణంతో దేశ రాజకీయాల్లో గొప్ప శకం ముగిసింది
– అన్ని రాజకీయ పార్టీలకు అయోద యోగ్యుడిగా అద్భుతమైన వక్తగా, కవిగా రాజకీయ విలువలు కలకాలం గుర్తుంటాయి
– ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా : వైసీపీ అధినేత వైఎస్ జగన్

అఖిలేష్ యాదవ్

– ఓ మహా వ్యక్తి అంతర్ధానమయ్యారు
– ఆయన ఇచ్చిన ప్రేరణ జీవితాంతం నిలిచే ఉంటుంది

రజనీకాంత్

– వాజ్ పేయి మరణ వార్త తీవ్ర దుఃఖాన్ని కలిగించింది

నితిన్ గడ్కరీ
– దేశం మహానాయకుడు, అజాత శత్రువును కోల్పోయింది
– మనందరిలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన వ్యక్తి వాజ్ పేయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*