కఠిన సవాళ్లను ఎదుర్కొన్న ధృడమైన ప్రధాని వాజ్‌పేయి

న్యూ ఢిల్లీ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
వాజ్‌పేయి రాజకీయ జీవితం :
– 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జననం
– 1939 లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ లో చేరిన వాజ్ పేయి
– గ్వాలియర్ ఆర్యసమాజ్ ప్రధాన కార్యదర్శి అయిన వాజ్ పేయి
– జర్నలిస్టుగా రాష్ట్ర ధర్మ, పంచజన్య పత్రికల్లో పని చేసిన వాజ్ పేయి
– క్విట్ ఇండియా ఉద్యమంలో 23 రోజుల పాటు పాల్గొన్న వాజ్ పేయి
– 1951 లో కొత్తగా అవతరించిన భారతీయ జనసంఘ్ లోకి వాజ్ పేయి
– 1957 లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయిన అటల్ బిహారీ వాజ్ పేయి
– జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకి అనుచరిడిగా వాజ్ పేయి
– 1977 లో గద్దె దిగిన కాంగ్రెస్, అదే సమయంలో జనతాపార్టీ స్థాపన
– మొరార్టీ దేశాయ్ కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా పని చేసిన వాజ్ పేయి
– 1970 నాటికి మొరార్జీ రాజీనామా చేయడంతో కుప్పకూలిన ప్రభుత్వం

– 1980 లో భారతీయ జనతా పార్టీని స్థాపించిన వాజ్ పేయి
– 1984 లో రెండు ఎంపీ స్థానాలు (హన్మకొండ, మెహ్ సానా) గెలిచిన బీజేపీ
– 1996 లో దేశానికి పదో ప్రధానిగా సేలవందించి వాజ్ పేయి
– ప్రధానిగా తొలి పర్యాయం మే 16 నుంచి జూన్ 1 (13 రోజులు)
– ప్రధానిగా రెండో పర్యాయం మార్చి 98 నుంచి అక్టోబర్ 99 (13 నెలలు)
– ప్రధానిగా మూడో పర్యాయం అక్టోబర్ 1999 నుంచి మే 2004 (నాలుగున్నరేళ్లు)
– 1999 లో ప్రధానితో పాకిస్తాన్ తో దౌత్య చర్చలు జరిపిన వాజ్ పేయి

– వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం
– వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే పార్లమెంట్ పై ఉగ్రదాడి
– కఠిన సవాళ్లను ఎదుర్కొని ధృడమైన ప్రధానిగా వ్యవహరించిన వాజ్ పేయి
– వాజ్ పేయిని బాగా కుంగదీసిన 2004 ఎన్నికల్లో ఓటమి
– గెలుస్తామన్న నమ్మకంతో 6 నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లిన వాజ్ పేయి
– 2004 ఎన్నికల్లో ఓటమి తనదే బాధ్యతగా ప్రకటించిన వాజ్ పేయి
– 2004 లో లోక్ సభ లో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరించిన వాజ్ పేయి
– 2009 లో వాజ్ పేయికు గుండెపోటు, స్టంట్ అమర్చిన డాక్టర్లు..
– 2015 లో దేశ అత్యున్నత అవార్డు భారత రత్నను అందుకున్న వాజ్ పేయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*