అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

హైదరాబాద్: ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని చాలా ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. ఓ ఉంగ‌రం.. రాజు రాణి బొమ్మ‌లు టైటిల్ లో క‌నిపిస్తున్నాయి. ఇది చాలా కొత్త‌గా ఉంటూ సినిమాపై ఆస‌క్తిని పెంచేసింది. ఈ కాన్సెప్ట్ పోస్ట‌ర్ తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ అంతా యుఎస్ లోనే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఇలియానా ఈ చిత్రంలో ర‌వితేజ జోడీ క‌డుతుంది. విజ‌య్ సి దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: శ‌్రీనువైట్ల
నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, వై. ర‌విశంక‌ర్, మోహ‌న్(సివిఎమ్)
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్
లిరిక్స్: రామ‌జోగ‌య్య‌శాస్త్రి
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*