
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న వాజ్పేయి మరణంలోనూ గొప్ప సందేశమిచ్చారు. హిందువుల అంత్యక్రియల్లో సాధారణంగా మహిళలు పాల్గొనరు. అయితే వాజ్పేయి అంత్యక్రియల్లో ఆయన దత్త పుత్రిక నమిత, మనవరాలు నిహారిక పాల్గొన్నారు. వాజ్పేయి చితికి దత్తపుత్రిక నమిత నిప్పు పెట్టారు. పాత సంప్రదాయాలకు వాజ్పేయి పాతరేశారు. మరణంలోనూ స్త్రీ-పురుష సమానత్వం చాటారు. వాజ్పేయి జీవించి ఉన్నప్పుడే ఇలా జరగాలని రాసి పెట్టారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
LIVE : Last rites of former PM Atal Bihari Vajpayee Ji from BJP HQ to Rashtriya Smriti Sthal, Delhi. #AtaljiAmarRah… https://t.co/rZdeVvCNkg
— BJP (@BJP4India) August 17, 2018
Last salute accorded to former PM
Atal Bihari Vajpayee at Smriti Sthal. #AtaljiAmarRahen pic.twitter.com/Ysk8SSpt9d— BJP (@BJP4India) August 17, 2018
అంతకు ముందు లక్షలాది అభిమానుల అశ్రునయనాల మధ్య స్మృతి స్థల్లో వాజ్పేయి భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో, వేదమంత్రోచ్ఛరణల మధ్య వాజ్పేయి అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, అద్వానీ, అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
है युग मनीषी अटल…तुम्हें कोटि-कोटि वंदन।
।। भावभीनी श्रद्धांजलि ।। pic.twitter.com/lICtrBfRg1
— Amit Shah (@AmitShah) August 17, 2018
Be the first to comment