
కొచ్చి: వానలు, వరదలతో అతలాకుతలమౌతున్న కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. నిన్న తిరువనంతపురం చేరుకున్న ప్రధాని ఈ ఉదయం కొచ్చి చేరుకున్నారు. వరద పరిస్థితులపై అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపడ్తోన్న సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో కేరళ సీఎం పినరాయి విజయన్, కేంద్ర మంత్రి అల్ఫోన్స్, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The Prime Minister is reviewing the flood situation in Kerala at a high-level meeting. @CMOKerala pic.twitter.com/3VNq0ehSry
— PMO India (@PMOIndia) August 18, 2018
ప్రధాని మోదీ నేడు సీఎం విజయన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. క్యాంపులను సందర్శించి అందుతున్న సహాయక చర్యలను పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడతారు. కేంద్రం తరపున భారీ సహాయాన్ని ప్రకటిస్తారని అంతా అంచనా వేస్తున్నారు.
కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళలో ఇప్పటివరకూ 324 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం విజయన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. పరిస్థితిని ప్రధానికి నివేదించారు. ఆ వెంటనే కేంద్రం 100 కోట్ల రూపాయల తక్షణ సాయం అందించింది.
Hon. Home Minister Shri @rajnathsingh who arrived 12.50pm at Kochi, has left to visit the places affected by heavy rainfall in Kerala. Shri @KJAlphons, Kerala CM, have accompanied Rajnath ji. pic.twitter.com/vMgNWIC5eG
— BJP KERALAM (@BJP4Keralam) August 12, 2018
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కేరళ వరద బాధితులకు ధన సహాయం అందిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సైనికులు చేపడ్తోన్న సహాయక కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు.
RSS Swayamsevaks rushed in for rescue works at various Flood hit zones in Kerala, helped and served the flood effected Citizens with Food, Shelter etc. #KeralaFloods pic.twitter.com/7WlZkmi4IB
— Swayamsevak (@friendsofrss) August 10, 2018
#RSS WORKERS#KeralaFloods pic.twitter.com/Kihv5lUhdr
— Arunlal MV (@arunlalmv) August 17, 2018
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం నేషనల్ ఎమర్జెన్సీ కమిటీని షేక్ ఖలీఫా నియమించారు.
Be the first to comment