
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న వాజ్ పేయికి విదేశీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. వాజ్పేయి పార్థివ దేహాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అభిమానులు, కార్యకర్తలతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు వాజ్పేయికి అంతిమ నివాళులర్పిస్తున్నారు.
బంగ్లాదేశ్ విమోచన సమయంలో వాజ్పేయి అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరవలేమని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబుల్ హసన్ చెప్పారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ వాజ్పేయి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ ఢిల్లీకి చేరుకున్నారు. వాజ్పేయి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.
వాజ్పేయి అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన మరణం భారత్కు తీరని లోటని భారత్లో బ్రిటీష్ హై కమిషనర్ డోమినిక్ చెప్పారు. అటు శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ ఢిల్లీ చేరుకున్నారు. వాజ్పేయి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఇంకా అనేక దేశాల నుంచి పలువురు ప్రముఖులు ఢిల్లీ చేరుకుంటున్నారు. వీరంతా వాజ్పేయికి అంతిమ నివాళి అర్పిస్తారు.
అంతకు ముందు అటల్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వాజ్పేయి అంతిమయాత్ర ప్రారంభమౌతుంది. సాయంత్రం 4 గంటలకు రాజ్ ఘాట్ సమీపంలో రాష్ట్రీయ స్మృతి స్థల్లో వాజ్పేయి భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
LIVE : Last rites of Bharat Ratna, former PM Shri Atal Bihari Vajpayee Ji. #AtaljiAmarRahen https://t.co/AiZHEPKUcZ
— BJP (@BJP4India) August 17, 2018
Be the first to comment