
న్యూఢిల్లీ: 113 కేసుల్లో నిందితురాలు బసీరన్ అలియాస్ మమ్మీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సంఘం విహార్‌లో ఈమెను ఈ నెల 17న అరెస్ట్ చేశారు. 62 ఏళ్ల బసీరన్కు 8 మంది కుమారులున్నారు. వీరందరినీ నేరస్థులుగా తీర్చిదిద్దిన ఈమె వీరితోటే నేర సామ్రాజ్యం ఏర్పాటు చేసింది.
కుటుంబమంతా నేరస్థులు కలిగి ఉన్న బసీరన్ అరెస్ట్ కావడం ఇది తొమ్మిదోసారి. కాంట్రాక్ట్ హత్యలతో సహా అన్ని రకాల నేరాల్లో బసీరన్ కుటుంబం ఆరితేరింది. 50వేలకు కూడా అనేక హత్య కాంట్రాక్టులు తీసుకుంది.
గడచిన 16 సంవత్సరాల్లో తన 8 మంది కుమారులతో అనేక నేరాలకు పాల్పడిందని డీసీపీ రొమిల్ బనియా తెలిపారు. బసీరన్ అరెస్ట్‌తో అనేక హత్య కేసులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈమె బాధితులు ముందుకొస్తే అన్ని కేసులూ తేలే అవకాశం ఉంది.
ఈమె నేర సామ్రాజ్య జీవితంపై త్వరలో బాలీవుడ్ లేదా హాలీవుడ్ సినిమా వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు.
Be the first to comment