కేరళకు మెగా ఫ్యామిలీ భారీ సాయం

హైదరాబాద్: వానలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు మెగా ఫ్యామిలీ భారీ సాయం అందించింది. మెగాస్టార్ చిరంజీవి 25 లక్షల రూపాయలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. రామ్ చరణ్ సతీమణి 10 లక్షల రూపాయల మందులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. చిరంజీవి తల్లి అంజనమ్మ లక్షరూపాయల సాయం ప్రకటించారు.

అటు మలయాళంలో మంచి మార్కెట్ ఉన్న అల్లు అర్జున్ ఇప్పటికే పాతిక లక్షల రూపాయల సాయం ప్రకటించారు.

ప్రధాని ఇవాళే కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించి 500 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. గతంలో ప్రకటించిన వంద కోట్ల రూపాయలకు ఇది అదనం. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టాయి.

కేరళకు దేశం నలుమూలల నుంచీ సాయం అందుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 10 కోట్లు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 20 కోట్లు, ఏపీ సీఎం చంద్రబాబు పది కోట్లు, తెలంగాణ సీఎం 25 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు.

 

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. పెద్ద సంఖ్యలో బోట్లతో పాటు సహాయక సిబ్బందిని కూడా కేరళకు పంపారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ 10 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు.

కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తోన్న వానలతో కేరళ తల్లడిల్లిపోతోంది. వానలు, వరదల కారణంగా దాదాపు 400 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*