
కొచ్చి: కుండపోతవానలతో తల్లడిల్లిపోతోన్న కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే జరిపారు. కేరళ సీఎం పినరాయి విజయన్, కేంద్ర మంత్రి అల్ఫోన్స్తో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
PM Modi conducted an aerial survey of flood affected areas. He has announced a financial assistance of Rs 500 crore to the state and an ex-gratia of Rs. 2 lakh per person to the next kin of the deceased and Rs. 50,000 to those seriously injured. #PMModiWithKeralam pic.twitter.com/6CU6YWTohW
— BJP (@BJP4India) August 18, 2018
The Prime Minister visited Kerala to review the situation arising due to the floods in the State.
After a review meeting, he made an aerial assessment of the damages caused due to floods in some of the affected areas. pic.twitter.com/DQtANpBUtI
— PMO India (@PMOIndia) August 18, 2018
ఏరియల్ సర్వే జరిపిన వెంటనే ప్రధాని మోదీ కేరళకు 500 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. ఈ సహాయం గతంలో ప్రకటించిన వంద కోట్ల రూపాయలకు అదనం. వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేరళకు అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు.
The @PMOIndia announced a financial assistance of Rs 500 Cr to the State.This is in addition to Rs100 Cr. announced by the Home Minister. He also assured the State Govt that relief materials including food grains, medicines etc would be provided, as requested. #PMModiWithKeralam
— BJP KERALAM (@BJP4Keralam) August 18, 2018
అంతకు ముందు ఆయన వరద పరిస్థితులపై కొచ్చిలో అధికారులతో సమావేశమై వరద పరిస్థితిని సమీక్షించారు. త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపడ్తోన్న సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో కేరళ సీఎం పినరాయి విజయన్, కేంద్ర మంత్రి అల్ఫోన్స్, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The Prime Minister is reviewing the flood situation in Kerala at a high-level meeting. @CMOKerala pic.twitter.com/3VNq0ehSry
— PMO India (@PMOIndia) August 18, 2018
కొద్ది రోజులుగా కుండపోత వర్షాలకు కేరళలో ఇప్పటివరకూ 324 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులు సెద్ద సంఖ్యలో సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
Be the first to comment