
ముంబై: ప్రియుడు నిక్‌తో ప్రియాంక ఎంగేజ్మెంట్ ముంబై జరిగింది. ప్రియాంక నివాసం జూహూ రెసిడెన్స్‌లో ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులైనవారిని మాత్రమే ఆహ్వానించారు. ప్రియాంక సోదరి పరిణితి చోప్రా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ప్రియాంక, నిక్ కుటుంబ సభ్యులు ఈ ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.
కొంతకాలంగా నిక్-ప్రియాంక ప్రేమలో ఉన్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు అమెరికా వెళ్లిన ప్రియాంక సింగర్ నిక్‌తో ప్రేమలో పడింది. కొంతకాలంగా వీరు అన్ని కార్యక్రమాలకూ జంటగానే హాజరౌతుండటంతో వీరు ప్రేమలో పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ నేడు ఎంగేజ్మెంట్ చేసుకుంటడంతో మీడియాలో వచ్చిన కథనాలు నిజమేనని తేలిపోయింది.
హాలీవుడ్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన ప్రియాంక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు అంగీకరిస్తోంది. త్వరలో సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమాలో నటించనుంది.
Be the first to comment