
ప్రకృతి బీభత్సానికి కేరళ విలవిల్లాడుతోంది. జల విలయంలో అల్లాడుతోంది. ఇళ్లు పేకమేడల్లా కూలుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు 320 మందికి పైగా మరణించగా, లక్షలన్నర మంది నిరాశ్రయులయ్యారు. నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక జనాలు అల్లాడిపోతున్నారు. సహాయక చర్యల్లో ఆర్మీ ముమ్మరంగా సాగుతోంది. హెలికాప్టర్ల ద్వారా వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ రానంత వరద తాకిడికి కేరళ మొత్తం అతలాకుతలమవుతోంది. సాయం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన విజ్ఞప్తికి పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు స్పందిస్తున్నారు. ఆర్థిక సాయానికి ముందుకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు హీరోలు ఇప్పటికే తమవంతు సాయం ప్రకటించారు. సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఎవరెవరు ఎంతంత ఆర్థిక సాయం ప్రకటించారంటే..
* అల్లు అర్జున్ రూ.25 లక్షలు
*విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు
* నిర్మాత బన్నీ వాసు ‘గీతగోవిందం’ వసూళ్లను విరాళంగా ప్రకటించాడు
* కమలహాసన్ రూ.25 లక్షలు
* సూర్య రూ.25 లక్షలు
* కార్తి రూ.25 లక్షలు
* విజయ్ రూ.25 లక్షలు
* మలయాళ చిత్ర పరిశ్రమ ‘అమ్మ’కు నటుడు సూర్య ప్రత్యేకంగా రూ.10 లక్షలు
* నటుడు సిద్ధార్థ్ రూ.10 లక్షలు
* రూ. సన్ టీవీ నెట్వర్క్ రూ. కోటి
* మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ రూ.25 లక్షలు
* సూపర్ స్టార్ మమ్ముట్టి రూ.25 లక్షలు
* మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) రూ.50 లక్షలు
* మాలీవుడ్ యువ నటుడు తొవినో థామస్ వరద బాధితులకు తన ఇంటిలో ఆశ్రయం కల్పిస్తున్నాడు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు బాధితులకు సరుకులు అందించనున్నట్టు ప్రకటించాడు.
Be the first to comment