
అమరావతి: మామూలు ఉద్యోగాల్లో లేనిది, ఒక ఎంపీ ఉద్యోగంలో ఏముంది? తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం తప్పదు. మనం ఎన్నుకుంటున్న ఒక్కోఎంపీకి ఐదేళ్ల కాలంలో వేతనం ఇతర సౌకర్యాల కల్పనకు కలిపి ఖర్చు భారీగా అవుతుంది. ఇవి కాక ఎంపీ లాడ్స్ రూపంలో ఒక్కో ఎంపీకి రూ. 10 కోట్లు కేటాయిస్తారు.
ఢిల్లీలో నామమాత్రపు రుసుముతో విలాసవంతమైన సౌకర్యాలతో వసతి గృహం, ఉచిత వైద్యం అందించడంతో పాటు అధికారిక విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే వెళుతుంది.
ఒక్కో ఎంపీకి ఒక పీఏ, వంట మనిషి, ఇద్దరు అటెండర్లను ప్రభుత్వమే కేటాయించి, వారి వేతనాలు కూడా చెల్లిస్తుంది. పదవిలో ఉన్నంత కాలం పోషించడమే కాక పదవీ విరమణ తర్వాత కూడా నెలకు కనీసం దాదాపు రూ. 5 వేల చొప్పున జీవిత కాలం పెన్షన్ అందిస్తారు. ఎక్కువ సంవత్సరాలు సభ్యుడిగా ఉంటే ఇది మరింతగా పెరుగుతుంది.
Be the first to comment