
వానలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే అనేక మంది స్టార్లు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించగా తాజాగా అక్కినేని నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ భారీగా విరాళాలు ప్రకటించారు.
కేరళ వరద బాధితులకు అక్కినేని నాగార్జున, అమల రూ.28 లక్షలు అందించారు.”ఇలాంటి కష్ట సమయంలో కేరళ ప్రజలకు మన అండదండలు ఎంతో అవసరం. అందుకే మా వంతు సాయంగా 28 లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేరళ ప్రజల్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కేరళ వరద బాధితులకు రూ.25 లక్షలు అందించారు. తన వంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించారు.
కేరళ వరద బాధితులకు సూపర్ స్టార్ మహేష్ సహాయం 25 లక్షల రూపాయలు అందించారు.
తన వంతు సహాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు అందించారు.
జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్‌రామ్ 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
నిన్న మెగాస్టార్ చిరంజీవి 25 లక్షల రూపాయలు, రామ్ చరణ్ పాతిక లక్షల రూపాయలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన పది లక్షల రూపాయల విలువైన మందులు ఇచ్చారు. చిరంజీవి తల్లి అంజనా దేవి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు.
ఇటీవలే అల్లూ అర్జున్ పాతిక లక్షలు, విజయ్ దేవరకొండ 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
పొరుగురాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఈ సంప్రదాయం మంచిదేనని అంతా అంటున్నారు.
#HelpKerala Our prayers and strength to people of Kerala in these hard times!! ..sending 28 lacs to the Kerala CM relief fund..we request everyone to come forward and help the people in need..???? Amala & Nagarjuna Akkineni
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 19, 2018
Highest respect to all those who are contributing towards Kerala flood relief. Salutations to Indian Army, Navy, Airforce & other rescue forces for their invaluable efforts at ground zero. #KeralaFloods #StandwithKerala #KeralaFloodRescue
— Mahesh Babu (@urstrulyMahesh) August 19, 2018
Be the first to comment