బిగ్‌బాస్‌లో విజయ్ దేవరకొండ సందడి

హైదరాబాద్: న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ప్రేక్షకులను రంజింప చేస్తోన్న బిగ్‌బాస్‌లోకి హీరో విజయ్ దేవరకొండ నేడు అడుగుపెడుతున్నాడు. ఈ రోజు రాత్రి 9గంటలకు ప్రారంభమయ్యే ఈ షోలో విజయ్ పాల్గొంటాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. తాను నటించిన గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో విజయ్ జోష్‌లో ఉన్నాడు. నేటి షోలో విజయ్ పార్టిసిపెంట్లతో పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని తెలుస్తోంది. దీప్తి సునయతో కలిసి నవ్వులు పండిస్తారట.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*