19-08-2018 నుండి 25-08-2018 వరకు వారఫలాలు

మేష రాశి …. ఈవారం మొత్తం మీద మీరు అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుట వలన శ్రమను పొందుతారు. నూతన ప్రయత్నాలను వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది.సమయానికి భోజనం చేయట అనేది సూచన. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట మంచిది. స్థానచలనం పొందుతారు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుట వలన లాభంను పొందుతారు. బంధువులతో సమయన్ని గడుపుతారు వారియందు ప్రీతిని కలిగి ఉంటారు. ప్రయత్నాలలో విజయంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుతారు. మానసికంగా సౌఖ్యంను పొందుతారు. సంతానవిషయంలో ఆరోగ్యసమస్యలు కలుగుతాయి. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కావున ప్రత్యేకశ్రద్ద అవసరం.బంధుమిత్రులతో కలిసి చేపట్టు పనులలో మాత్రం నిదానం అవసరం అనవసరపు తప్పిదాలు చేయకండి వివాదములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.

వృషభ రాశి ….. ఈవారం మొత్తం మీద మీరు మరొక ప్రదేశంలో నివసించవలసి రావోచ్చును నచ్చని విధంగా సమయాన్ని గడుపుతారు. కుటుంభంలో చేయుఆలోచనల విషయంలో నిదానం అవసరం,మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది నిదానంగా వ్యవహరించుట మంచిది. సంతానపరమైన ఇబ్బందులు కలుగుతాయి సర్దుకుపొండి నిదానం అవసరం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు వారితో సమయన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారులతో మీకు గల మంచి పరిచయాలు ఉపయోగపడుతాయి. ఇష్టమైనపనులను చేపడుతారు సమయాన్నినచ్చిన విధంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. మానసికంగా సంతోశంను పొందుతారు నచ్చిన పనులను చేపట్టు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ధనమునకు సంభందించిన విషయాల్లో మాత్రం అనుకోని ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త.

మిథున రాశి …… ఈవారం మొత్తం మీద మీరు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించి పనులను విజయ వంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. బంధువులతో సమయాన్ని గడుపుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో కొంత సహకారం ఇతరులనుండి పొందు అవకాశం ఉంది. మనోదైర్యంను కలిగి ఉండి కోత కొత్త ఆలోచనలు చేస్తారు . బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చును కలిగి ఉంటారు. చిన్న చిన్న పనుల కోసం అధికమైన సమయం కోల్పోయే అవకాశం ఉంది. ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు అనుకూలించక పోవచ్చును వీలైనంత వరకు వాయిదా వేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులను పొందుతారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి వాటిని అశ్రద్ద చేయకండి. నూతన పనులను ఆరంభించక పోవడం మేలుచేస్తుంది. పనుల విషయంలో పెద్దల సూచనలు పాటించుట మంచిది.

కర్కాటక రాశి ……ఈవారం మొత్తం మీద ధనాదాయం బాగుంటుంది నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం ఉంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు కాకపోతే నూతన పనులకు సంభందించి నిర్ణయాలు తీసుకొనే ముందు బాగాఆలోచించండి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మోకాళ్ళనొప్పుల మూలాన సమస్యలు పొందుతారు. కొత్త పనులను చేపట్టుట వలన శ్రమను తద్వారా ఇబ్బందులను పొందుటకు ఆస్కారం ఉంది. కుటుంభంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకం అయ్యే అవకాశం ఉంది కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తిచేసి విజయంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. తలపెట్టిన పనులకు సంభందించిన విషయాల్లో సరైన ప్రణాళిక ఉన్నచో విజయాలను పొందుతారు. శరీరసౌఖ్యంను పొందుతారు. ఇష్టమైన పనులను చేపట్టి సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు.

సింహ రాశి …… ఈవారం మొత్తం మీద మీరు కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను కలిగి ఉంటారు. నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులను ఉత్సాహంతో పూర్తిచేసే అవకాశం ఉంది. మీ వలన తోటివారు సహాయంను పొందుఅవకాశం ఉంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన అవకాశాలు పొందుతారు. స్త్రీ/పురుష సౌఖ్యంను కలిగి ఉంటారు. నలుగురిలో మంచిపేరుకోసం చేయుప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించక పోవడం ఉత్తమం నిదానంగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు కలుగుతాయి.

కన్యా రాశి …… ఈవారం మొత్తం మీద మీరు బంధుమిత్రులతో విరోధములు కలుగుటకు అవకాశం ఉంది కావున సర్దుబాటు విధానం కలిగి ఉండుట మేలుచేస్తుంది. నూతన ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. పనులను ఆరంభించాల్సి వస్తే గట్టి ప్రయత్నం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఒకవార్త భాదను కలిగించేదిగా ఉండు అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట ఉత్తమం,చేపట్టు ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట ఉత్తమం. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. నూతన అవకశాలు పొందుతారు. ఉద్యోగంలో మార్పును పొందుతారు. నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది.

తులా రాశి …….ఈవారం మొత్తం మీద మీరు అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీయొక్క మాతతీరు వివాదములకు దారి తీసే అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులు అధికమైన ఖర్చును కలిగి ఉండే అవకాశం ఉంది ధననష్టం జరుగుతుంది జాగ్రత్త. నూతన ఆలోచనలు ముందుకు కలుడులుతయై వాటి మూలాన నచ్చిన పనులను చేపట్టు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా అడుగులకు వేయుట వలన లాభంను పొందుతారు. దూరప్రదేశాల నుండి వార్తను వినే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం నిదానం అవసరం. మాటలు పొదుపుగా వాడుట అనేది సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ధనలాభంను పొందుతారు నూతనఅవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. అధికారులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకొంటారు. ఋణముల వలన ఇబ్బందులు కలుగుతాయి. ధనమునకు సంభందించిన విషయాల్లో లెక్క చెప్పవలసి రావోచ్చును,ఓర్పును కలిగి ఉండుట తప్పక మేలుచేస్తుంది. సమయానికి భోజనం తీసుకొనే ప్రయత్నం చేయండి.

వృశ్చిక రాశి …….ఈవారం మొత్తం మీద మీరు భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు,విందులలో పాల్గొను అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది అధికారులతో గుర్తింపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగుదల ఉంటుంది. చిన్న చిన్న పనులను పూర్తిచేయుట ద్వార లాభంను పొందుతారు. వ్యాపరంలో ధననష్టం పొందుటకు అవకాశం ఉంది. వ్యాపరంలో ఇబ్బందులు పొందుటకు ఆస్కారం ఉంది కావున తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి లేకపోతే సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. స్థానచలనం పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. ధనమునకు సంభందించిన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యసమస్యలు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. పెద్దల సూచనలు పాటించుట వలన వివాదములు తొలగుటకు ఆస్కారం ఉంది. చేయువృత్తిలో అనుకోని చిక్కులు పొందుతారు నిదానం అవసరం.

ధనస్సు రాశి …… ఈ వారంమొత్తం మీద పెద్దలను కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. వారి సూచనలు పాటించుట వలన పేరును పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు.కుటుంబంలో అనుకోని సంగాటనలు జరుగుట వలన వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. కొంత మీరు విచారంను పొందుటతారు. బంధువులతో,మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు తలపెట్టిన పనులలో ఆర్థికపరమైన లాభంను పొందుతారు. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కలదు. అధికారులతో మంచి సంభందాలు కలిగి ఉండుట చేత పనులను పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి మంచిది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ప్రతి పనిలో సర్దుబాటు విధానం అవసరం. ప్రయాణాలు చేయునపుడు నిదానం మంచిది. వీలయితే వాటిని వాయిదా వేయుట ఉత్తమం. ఉద్యోగంలో మాత్రం ఒత్తిడిని కలిగి ఉంటారు. భోజనం విషయంలో మీకంటూ ఇస్టంను చూపిస్తారు.

మకర రాశి …… ఈవారం మొత్తం మీద మీరు మాటలను పొదుపుగా వాడుట సూచన. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. ధనమునకు సంభందించిన విషయాల్లో కొంత ఆలోచించి అడుగులు ముందుకు వేసినచో నష్టం తగ్గుటకు ఆస్కారం ఉంది. వ్యాపరంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును జాగ్రత్త. ఇష్టమైన వారితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలుగుతాయి. కాకపోతే ప్రతి పనిని ఆచితూచి ఆరంభించుట సూచన. ప్రయాణాలు చేయకండి అలసి పోయే అవకాశం ఉంది. పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట సూచన. గతంలో ఆరంభించిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయండి ఉత్తమం. కొత్త కొత్త ఆలోచనలు ఉన్నను కొంత వేచి చూసే దొరని మంచిది. అనారోగ్యసమస్యల మూలాన ఇబ్బందులు పొందుతారు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. సంచారం చేయవలసి రావోచ్చును కావున తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి లేకపోతే శ్రమను పొందుతారు.

కుంభ రాశి ……ఈవారం మొత్తం మీద మీరు స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో గట్టి ప్రయత్నం చేయుట వలన లాభిస్తుంది శ్రమను పొందుతారు. కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుతారు సంతోషంగా గడిపే అవకాశం ఉంది. తోటివారికి సహయం చేయలనే ఆలోచన చేస్తారు మీ వలన కొంత మంది ఉపకారం పొందుతారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. అర్థికాభివ్రుద్దిని పొందుతారు నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. నలుగురిలో మీరు ఆశించిన గుర్తింపును పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలు పెట్టుట మంచిది. ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం.

మీన రాశి …….. ఈవారం మొత్తం మీద తలపెట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కోనసాగుతాయి. ఇష్టమైన పనులను చేపట్టుటలో ఇస్టంను కలిగి ఉంటారు. బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా అనుకున్న పనులు నెరవేరుట ద్వార మేలుజరుగుతుంది.మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు,భోజనసౌఖ్యంను పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో మంచి అవకాశాలు కలుగుతాయి వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. అధికంగా ఆలోచనలు చేయుట వలన కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కలదు కావున ఆలోచనలను నియత్రించుకోవడం ఉత్తమం. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకండి నిదానం అవసరం. నూతన పనులను వాయిదా వేయుట ఉత్తమం. అనుకోని ఖర్చులు కలుగుతాయి తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ఉత్సాహంను కలిగి ఉంటారు కాకపోతే ఆలోచనలు చేయునపుడు పెద్దల సూచనలు పాటించుట తప్పక మేలుచేస్తుంది. భోజనం విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండే అవకాశం కలదు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*