అప్రమత్తంగా ఉండండి: రాష్ట్రంలో వరద పరిస్థితి పై సీఎం

అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టులో పెరుగుతున్న వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని..నీరు, ఆహారం, నీరువంటి కనీస అవసరాలను తీర్చే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. వరద నీటి రాకను ఎప్పటికప్పుడు అంచనా వేసి, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ ఏర్పాట్లు చేయాలని, విపత్తుల నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ ల సూచనలకనుగుణంగా సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. వరద ప్రాంతాల్లో చేపట్టే సహాయచర్యల్లో స్వచ్ఛంద సంస్థలు , స్థానికులు కూడా భాగస్వామ్యం అవ్వాలిన సీఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలన్నారు. ప్రమాదపు అంచున ఉన్న వంతెనలపై ప్రయాణించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతున్న త్రివిధ దళాలను సీఎం అభినందించారు. పూర్తిగా వర్షాలు, వరద తగ్గే వరకు అలసిపోకుండా పని చేయాలని భద్రతా దళాలను ముఖ్యమంత్రి ఆదేశించారు. కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం లేదా పునర్నిర్మాణంవంటి చర్యలు చేపట్టి ప్రాణ నష్టాలు జరగకుండా యంత్రాంగం సమాయత్తమవ్వాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వరి నాట్ల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలకు విష సర్పాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.

వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తక్షణమే చేపట్టాలి, కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*