
స్మార్ట్‌ఫోన్ మేకర్ హువేయి గత నెలలో మార్కెట్లోకి విడుదల చేసిన నోవా 3 ఓపెన్ సేల్కు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి అమెజాన్ ఇండియా ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హువేయి గత నెలలో నోవా 3తో పాటు నోవా 3ఐని కూడా మార్కెట్లోకి విడుదల చేసి అమెజాన్ ఇండియా ద్వారా ఫ్లాష్ సేల్ నిర్వహించింది. ఇప్పుడు డైరెక్ట్ సేల్కు సిద్ధమైంది. నోవా 3ఐ ఐరిస్ పర్పుల్ కలర్ వేరియంట్‌కు ఈ నెల 21న అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా తొలిసారిగా ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది.
హువేయి నోవా 3, నోవా 3ఐ ధరలు ఇండియాలో వరుసగా రూ.34,999, రూ.20,990. ఈ రెండు వేరియంట్లు భారత్‌లో ఐరిస్ పర్పుల్, బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. నోవా 3ఐ ఐరిస్ పర్పుల్ వేరియంట్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల అమెజాన్ ఇండియాలో ఫ్లాష్‌సేల్ ద్వారా అందుబాటులో ఉండనుంది. నోవా 3 బ్లాక్, ఐరిస్ కలర్ వేరియంట్లు ఈనెల 23న మధ్యాహ్నం ఒంట గంట నుంచి ఓపెన్ సేల్కు రానున్నాయి. అయితే, ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా సేల్ నిర్వహించనున్నారు.
లాంచింగ్ ఆఫర్లో భాగంగా నోవా 3పై 12 నెలలపాటు నోకాస్ట్ ఈఎంఐ, స్క్రీన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఇవ్వనుంది. ప్రైమ్ మెంబర్లకు ఎక్స్చేంజ్ ఆపర్లో అదనంగా రూ.3 వేలు, అంతకంటే పైన రాయితీ లభించనుంది. ప్రైమ్ మెంబర్లు కాని వారికి రూ.2 వేల వరకు ఎక్స్చేంజ్ రాయితీ లభించనుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుపై ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.3 వేల తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రిలయన్స్ జియో యూజర్లకు రూ.1200 అదనపు క్యాష్‌బ్యాక్, రూ.3,300 విలువైన పార్ట్నర్ వోచర్లు, 100 జీబీ డేటా లభిస్తుంది. ప్రతీ 50 ఫోన్ల అమ్మకం తర్వాత లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇందులో గెలిచిన వారికి రూ.10 వేల అదనపు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
హువేయి నోవా 3 ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. 16+24 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 24+2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లో 3,750 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.
Be the first to comment