కేరళకు భారీ విరాళం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోలు

అమరావతి: వరదలతో అతలాకుతలమైన కేరళకు దేశం నలుమూలలనుంచి పెద్ద ఎత్తున సాయం అందుతోంది. తమ వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోలు 20 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు అశోక్ బాబు, జోసెఫ్, సుధీర్ సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందించారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పది కోట్ల రూపాయలు ప్రకటించింది.

అటు శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల రోజుల జీతాన్ని కేరళ వరద బాధితులకు అందించారు.

తెలంగాణ పీసీసీ తరపున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళంగా ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా 25 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. తాజాగా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి నిన్న కేరళ సీఎంను కలిసి 25 కోట్ల రూపాయల చెక్‌ను అందించారు.

కేంద్ర ప్రభుత్వం మొత్తం 600 కోట్ల రూపాయల సాయం అందించింది. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించింది.

మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ వరద బాధితులకు విరాళాలు ప్రకటించాయి.

కేరళలో ప్రస్తుతం వానలు తగ్గుముఖం పెట్టాయి. ఎన్డీఆర్‌ఎఫ్, భారత త్రివిధ దళాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*