సైరా టీజర్ అదుర్స్

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా టీజర్ విడుదలైంది. చిరంజీవి తల్లి అంజనీ దేవి చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజైంది. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, సురేఖ, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ బర్త్‌డేకు ఒకరోజు ముందే ఈ టీజర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునే అవకాశం కల్పించారు.

సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతి బాబు, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు నటించారు. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించారు. సంగీతం అమిత్ త్రివేది అందించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*