కేరళకు యూఏఈ ప్రభుత్వం భారీ సాయం

న్యూఢిల్లీ: వరదలతో అతలాకుతలమైన కేరళకు యూఏఈ ప్రభుత్వం భారీ సాయం అందించింది. రూ.695 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. నిజానికి కొద్దిరోజుల క్రితమే యూఏఈ ప్రభుత్వం కేరళ ప్రజలను ఆదుకునే లక్ష్యంతో ఎమర్జెన్సీ టీమ్‌ను ఏర్పాటు చేసింది. వరద నష్టాన్ని అంచనా వేసి 695 కోట్ల రూపాయలను అందించింది.

దుబాయ్ ప్రభుత్వానికి కేరళ సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు.

కేరళకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 600 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.

కేరళను ఆదుకునేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. తెలంగాణ 25 కోట్లు, మహారాష్ట్ర 20 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 10 కోట్ల రూపాయల సాయం ప్రకటించాయి. బీహార్, ఒరిస్సా, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున సాయం ప్రకటించాయి.

కేరళ ప్రజలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు.

కేరళలో వానలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*