సెంచరీ చేసి అనుష్కకు ముద్దులు విసిరిన కోహ్లీ

టీమిండియా సారథి‌ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో రెండో ఇన్నింగ్స్‌‌లో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీకి ఇది రెండో సెంచరీ. టెస్ట్ కెరీర్‌లో 23వది. కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో అతడి భార్య అనుష్క గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తోంది.

ఎడ్జ్‌బాస్టన్‌లలో సెంచరీ బాదగానే కోహ్లీ నిశ్చితార్థ ఉంగరాన్ని ముద్దుపెట్టుకున్నాడు. ఇప్పుడు, గ్యాలరీలో ఉన్న అనుష్కకు ముద్దులు విసిరాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

కాగా, మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయం ఖాయమన్నట్టే. అయితే, అది నేడే, రేపా అన్నదే ప్రశ్న. మూడో రోజు భారత్ 327 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో మొత్తంగా భారత్‌కు 521 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. పాండ్యా మరోసారి నిప్పులు చెరిగే బంతులు సంధిస్తే భారత్‌కు విజయం ఈ రోజే సిద్ధిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*