ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లు ప్రకటించిన ఎయిర్‌టెల్

దేశంలోని అతిపెద్ద టెలికం నెట్‌వర్కింగ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బుధవారం ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ వాయిస్ ప్యాక్‌లు, ‘ఫారెన్ పాస్’లను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌ల కనీస ధర రూ.196. అమెరికా, ఇంగ్లండ్, కెనడా, యూఏఈ, కువై్, ఖతర్ వంటి 20 దేశాలకు ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్యాక్‌లు వేయించుకున్న ఎయిర్‌టెల్ ఖాతాదారులు భారత్‌కు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతో పాటు, లోకల్ కాల్స్‌ను ఉచితంగా పొందవచ్చు. రూ.196 ప్యాక్‌తో 20 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. రూ.296 ప్యాక్‌తో 40 నిమిషాలు, రూ.446 ప్యాక్‌తో 75 నిమిషాలు మాట్లాడుకోవచ్చు.

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఇటువంటి ప్యాక్‌లు ప్రవేశపెట్టిన ఘనత తమదేనని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఖాతాదారుల సంతృప్తి కోసం మున్ముందు మరిన్ని ప్యాక్‌లు తీసుకొస్తామని ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాని వెంకటేశ్ తెలిపారు.

ఎయిర్‌టెల్ తాజా ప్యాక్‌లు యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, అమెరికా, ఖతర్, కువైట్, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్, శ్రీలంక, బెహ్రైన్, చైనా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, థాయిలాండ్‌కు అందుబాటులో ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*