
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మెగాస్టార్ చిరంజీవికి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డే చిరంజీవి గారు. రానున్నరోజుల్లో మీరు మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు. కాగా, నేడు 63వ పుట్టిన రోజు జరుపుకున్నచిరంజీవికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Happy birthday Chiranjeevi Garu. May you be blessed with health and success in the coming year and may all your wishes come true #HBDMegastarChiranjeevi
— Lokesh Nara (@naralokesh) August 22, 2018
మరోవైపు, వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన మెగాస్టార్‌కు వెరీ హ్యాపీ బర్త్ డే. మాలాంటి ఎంతోమంది సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి మీరే. మీరే మా రోల్ మోడల్. థ్యాంక్యూ అన్నా’’ అని ట్వీట్ చేశాడు.
Chiru sir ❤
Happy Birthday.
I will hold on to all the care, concern and advice you gave me.
You are our hero. Stay forever healthy and happy. pic.twitter.com/QMyMkKk767— Vijay Deverakonda (@TheDeverakonda) August 22, 2018
Be the first to comment