ఈత సరదాకు నలుగురు విద్యార్థుల బలి.. కృష్ణా నదిలో మునిగి మృత్యువాత

ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండెమెడ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. చాలాకాలం తర్వాత కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి కిందికి నీటిని విడుదల చేశారు. దీంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చిర్రావూరుకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆటోలో వెళ్లారు. ఒడ్డున ముగ్గురు విద్యార్థులు ఉండగా, నలుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో నదిలోకి దిగిన విద్యార్థులు కొట్టుకుపోయారు. మృతి చెందిన నలుగురు విద్యార్థులు ఒకే పాఠశాలకు చెందినవారు. వీరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

మృతి చెందిన విద్యార్థులను తాడేకోరు శివ(14), నీలం క్రాంతికుమార్‌(10), నీలం శశి(8), దినేశ్‌(7)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. అయితే, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*