
హైదరాబాద్: బాబాయిని పెళ్లి చేసుకుందని కన్న కూతురి గొంతుకోశాడో కసాయి తండ్రి. ఘటన హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.
నాలుగేళ్ల క్రితం తనకు బాబాయి వరుసయ్యే సురేశ్‌ను విజయ పెళ్లి చేసుకుంది. దీంతో పరువు నష్టంగా భావించిన తండ్రి నర్సింహ కుమార్తె విజయపై కక్ష పెంచుకున్నాడు. అదను కోసం వేచి చూశాడు.
నాలుగు రోజుల క్రితం బంధువులు చనిపోవడంతో సురేశ్, విజయ అబ్దుల్లాపూర్‌మెట్ వచ్చారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కుమార్తెపై దాడి చేసిన నర్సింహ ఆమె గొంతు కోసి చంపేశాడు.
నాలుగేళ్ల క్రితం వివాహం జరిగితే ఇప్పుడు చంపడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా నర్సింహ కక్ష పెంచుకున్నాడా? అదను కోసం వేచి చూశాడా? పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
Be the first to comment