
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇండియో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి సాయంత్రం 6:42 గంటలకు తిరుపతి బయలుదేరిన విమానంలో అరగంట తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వారు అనుమతించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న 68 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్, మాజీ మంత్రి ఆనం సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఉండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Be the first to comment