కేరళలో తగ్గిన వరద.. ఇంటికొస్తున్న వారిని ఆహ్వానిస్తున్న మొసళ్లు

జల ప్రళయంతో విలవిల్లాడిన కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక శిబిరాల్లో ఇన్నాళ్లు తలదాచుకున్న వారు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇళ్లనీ బురద, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమైపోయాయి. కొన్ని ఇళ్లు అయితే దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే, కొన్ని ఇళ్లలో వీటితో పాటు మొసళ్లు కూడా వచ్చి చేరాయి. మరికొన్ని ఇళ్లను పాములు, పురుగులు, కీటకాలు ఇతర జలచరాలు ఆవాసంగా మార్చుకున్నాయి.

త్రిసూరు జిల్లాలోని చలకుడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం ఇంటికి వెళ్లగా.. లోపల మొసలి కనిపించడంతో భయంతో పరుగులు పెట్టాడు. చుట్టుపక్కల వారి సాయంతో దానిని తాళ్లతో బంధించాడు. మలప్పురం ప్రాంతంలో అయితే ఇళ్లలోకి పాములు, పురుగులు వచ్చి చేరడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రెండు రోజుల్లో ఏకంగా వంద పాములు పట్టుకున్నట్టు ఓ వ్యక్తి పేర్కొనడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక ఎర్నాకుళంలో పాము కాట్లకు 52 మంది ఆసుపత్రి పాలయ్యారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వస్తున్న ప్రజలు వీటిని చూసి తిరిగి అక్కడికే వెళ్లిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*