పవన్‌పై చిరుకు గంపెడాశలు?

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని కుటుంబ సమేతంగా వచ్చి కలిశారు ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ దంపతులు రావడంతో చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. బర్త్‌డే సందర్భంగానైనా తమ్ముడు ఇంటికి రావడంతో చిరు నిజమైన పండగ చేసుకున్నారు.

రాజకీయంగా తాను నెరవేర్చలేకపోయిన కలలను తన తమ్ముడు పవన్ నెరవేరుస్తారని చిరంజీవి గంపెడాశలతో ఉన్నారు. చిరంజీవి స్వతహాగా సున్నిత మనస్కుడు కావడంతో రాజకీయంగా రాణించలేకపోయారు. అయితే పవన్ మొదట్నుంచీ కొంచెం డిఫెరెంట్. అందుకే రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. క్రమంగా రాటుదేలుతున్నారు. ఏకకాలంలో మోదీ, బాబు, జగన్‌లపై విరుచుకుపడుతున్నారు. తానే ప్రత్యామ్నాయమని చాటుకుంటున్నారు. జగన్, చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని, బీజేపీ విభజన హామీలను నెరవేర్చలేకపోయిందంటూ ప్రచారం చేసుకుంటూపోతున్నారు.

రాజకీయ సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరౌతూ పవన్‌కు అండగా ఉంటుండటంతో చిరు సహజంగానే చిన్న తమ్ముడిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాను నెరవేర్చలేకపోయిన రాజకీయ హామీలను పవన్ తప్పకుండా నెరవేర్చగలరని చిరు భావిస్తున్నారు. చిరు అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలంటే 2019 వరకూ ఆగక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*