విజయనగరంలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును కడతేర్చిన తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకునే కడతేర్చిందో తల్లి. నగరంలోని గాయత్రీ నగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న వెంకట పద్మావతికి గోవింద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ సంబంధానికి కుమారుడు హరి భగవాన్ (17) అడ్డంగా ఉండడంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని తల్లి భావించింది.
సమయం కోసం ఎదురుచూస్తున్న ఆమె మంగళవారం  రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి అతడికి పెట్టింది. తల్లి పెట్టిన భోజనం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తర్వాత కుమారుడిని చున్నీతో ఉరివేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడి పాాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*