సికింద్రాబాద్‌లో గుండెకోత..

చిలకలగూడ: సికింద్రాబాద్ ‌చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనంపై అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్న 18 నెలల వయసున్న శ్రావ్య, పదేళ్ల పల్లవి కింద పడిపోయి క్షణాల్లో విగతజీవులయ్యారు.

రోజులాగే ఆడుకోవడానికి శ్రావ్య, పల్లవి భవనంపైకి వెళ్లారు. అరగంట పాటూ ఆడుకున్నారు. అంతలోనే పెద్దగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో చూసేలోపే ఇద్దరు చిన్నారులు భవనం కింద ఉన్న కారుపై పడిపోయారు. శ్రావ్య కింద పడిపోతుండగా కాపాడేందుకు పల్లవి యత్నించింది. ఈ క్రమంలో తాను కూడా పడిపోయింది. శ్రావ్య అక్కడికక్కడే చనిపోగా పల్లవిని చుట్టుపక్కల వారు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పల్లవి కన్నుమూసింది.

ఒకేరోజు ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంతో చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*