కేరళకు రూ. 10 లక్షల సాయం ప్రకటించిన దర్శకుడు మురుగదాస్

వరదలతో అతలాకుతలమైన కేరళకు ప్రముఖ సినీ దర్శకుడు మురుగదాస్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటలు ఇప్పటికే ఆర్థిక తోచినంత విరాళాలు ప్రకటించగా తాజాగా మురుగదాస్, నటుడు జయం రవి రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

మరో ప్రముఖ నటుడు రాధారవి నేతృత్వంలో ఆయన అభిమానులు, అనుచరులు కేరళకు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యం, దుస్తులు, ఇతర ఆహార పదార్థాలను శివకార్తికేయన్ అభిమానులు కేరళకు పంపిస్తున్నారు. చెన్నైకి చెందిన అయ్యప్ప సేవా సమాజం రూ.5లక్షల విరాళం ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*