మంత్రులతో కొనసాగుతున్న కేసీఆర్ సమావేశం.. ముందస్తు ఎన్నికలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో మంత్రులతో నిర్వహిస్తున్న సమావేశం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 24న కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ, శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభపై చర్చించనున్నారు. సెప్టెంబరు 2న హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, ముందస్తు ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సేకరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు.

కొంగరకలాన్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 25 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, ఐదు గంటలుగా కొనసాగుతున్న సమావేశం నేటి అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*