సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. 95 ఏళ్ల నయ్యర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

1923 ఆగస్ట్ 14న అవిభక్త భారత్ లోని పంజాబ్‌ సియాల్‌కోట్‌లో జన్మించారు. జర్నలిస్ట్‌గా దశాబ్దాల పాటు ఆయన నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఎమర్జెన్సీ సమయంలో నాటి ఇందిరా గాంధీ సర్కారును దుమ్మెత్తిపోశారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఉర్దూ పత్రికకు కూడా పనిచేసిన నయ్యర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. 1990లో బ్రిటన్ హై కమిషనర్‌గా పనిచేశారు. 1997లో రాజ్యసభకు ఎంపికయ్యారు.

కుల్దీప్ నయ్యర్ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మెరుగైన భారత్ కోసం కుల్దీప్ కలలు కనేవారని మోదీ ట్వీట్ చేశారు.

నయ్యర్ మరణంపై  సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*