
ధర్మవరం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు చనిపోయారు. 10 మంది గాయపడ్డారు. ధర్మవరంలో ఓ వివాహానికి వెళ్తుండగా పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బాధితులు రొద్దం మండలం లక్సానుపల్లి, తీమ్మాపురం గ్రామవాసులు. మృతులను గోపాల్ రెడ్డి, రవిందర్ రెడ్డి, అంజినప్ప, వేంకటప్ప, వడ్డే అంజి, వేంకటస్వామిగా గుర్తించారు. వీరితో పాటు మరో నలుగురి పరిస్థితి విషమం ఉండటంతో బెంగళూరుకు తరలించారు.
ఘటనపై మంత్రి పరిటాల సునీత తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై ఆమె జిల్లా కలెక్టర్, ఆర్డీవో, స్ధానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు.
Be the first to comment