
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖులంతా ఒకే చోట చేరారు. వీరిలో డైరెక్టర్ వంశీ, బోయపాటి శ్రీను, కొరటాల శివ, సుకుమార్, పరశురామ్, బీ.గోపాల్, మెహర్ రమేశ్, వక్కంతం వంశీ ఉన్నారు. వీరికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ కూడా తోడయ్యారు. అందరూ కలిసి సందడి చేశారు. మెగాస్టార్‌తో ఫొటోలు దిగి మెగాస్టార్ మూమెంట్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
MEGA STAR ????Moments @alluarjun #RamCharan pic.twitter.com/RXEy7SzUGL
— Meher Ramesh (@MeherRamesh) August 23, 2018
With #MegaStarChiranjeevi Annayya ????@directorvamshi,Sukku,@sivakoratala ,V.Vamsi,@ParasuramPetla ,B.Gopal ji, B.Srinu pic.twitter.com/hqLjlZujE6
— Meher Ramesh (@MeherRamesh) August 23, 2018
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. కొన్నిచోట్ల అభిమానులు రక్తదానాలు చేస్తే మరికొన్ని చోట్ల పేదలకు దుస్తులు, పండ్లు పంచారు. మరికొందరు మొక్కలు నాటారు.
చిరూ బర్త్‌డేకు ఒకరోజు ముందే విడుదలైన సైరా టీజర్ కోట్లాది మంది మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
Be the first to comment