వరంగల్‌లో విషాదం.. ఉరేసుకుని తల్లీకూతుళ్లు ఆత్మహత్య

వరంగల్ అర్బన్: వరంగల్‌లో విషాదకర ఘటన జరిగింది. హనుమకొండ బొక్కలగడ్డ సిటిజన్స్ క్లబ్ సమీపంలో తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. తల్లి సరిత(35) రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఆర్‌ఐ. కుమార్తె మధుమిత (16) డిగ్రీ చదువుతుంది.

4 నెలల కింద కొడుకు చనిపోయాడనే మనస్తాపంతో వీరిద్దరూ ఉరేసుకుని చనిపోయారు. ఘటనతో హనుమకొండలో కలకలం రేగింది. బొక్కలగడ్డలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*