భారత్‌లోకి కవాసకి సూపర్ బైక్స్.. ధర మాత్రం చుక్కల్లో!

దేశంలోని బైక్ ప్రియుల కోసం ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సంస్థ కవాసకి సరికొత్త బైక్‌లను విడుదల చేసింది. నిన్జా హెచ్‌2 రేంజ్‌లో మూడు వేరియంట్లను భారత విఫణిలోకి తీసుకొచ్చింది. ధరలు మాత్రం ఆకాశంలో ఉన్నా బైక్ ప్రియుల మనసులు మాత్రం కొల్లగొట్టేలా ఉన్నాయి. ఈ బైక్‌ల కనీస ధర రూ.34.5 లక్షలు (ఢిల్లీ, ఎక్స్ షోరూం).

కవాసకి నిన్జా హెచ్‌2 బైక్‌ ధర రూ. 34.5లక్షలు కాగా, నిన్జా హెచ్‌2 కార్బన్‌ ధర రూ. 41లక్షలు, నిన్జా హెచ్‌2ఆర్‌ ధర రూ. 72లక్షలుగా సంస్థ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి బైక్‌ల బుకింగ్ ప్రారంభం కానున్నట్టు కవాసకి తెలిపింది. బుక్ చేసుకున్న వారికి వచ్చే ఏడాది నుంచి డెలివరీ చేయనున్నట్టు వివరించింది. బైక్ బరువు 238 కేజీలు కాగా, ఇంజిన్ సామర్థ్యం 230 బీహెచ్‌పీ శక్తిని, 141.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*