ఏపీ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ.. మరికొద్ది సేపట్లో ప్రకటించనున్న కొత్తపల్లి గీత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరికొద్ది సేపట్లో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఆమె గత కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ఆమె స్పష్టత ఇవ్వకపోవడంతో పుకారుగానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చినా ఆమె తాజా ప్రకటనతో అది కూడా తప్పని తేలిపోయింది.

నేడు విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించనున్నట్టు గీత గురువారమే వెల్లడించారు. నగరంలోని బెంజ్ సర్కిల్‌లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్టు గీత తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె సొంత పార్టీపై పోటీ చేయనున్నారు. పార్టీ పేరు, విధివిధానాలు, ఇతర వివరాలు మరికొద్ది సేపట్లో వెల్లడికానున్నాయి.

.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*