
కృష్ణా: గన్నవరంలోని బాపులపాడులో బ్యూటీషియన్ పిల్లి పద్మపై హత్యాయత్నం జరిగింది. ప్రియుడు నూతన్ కుమార్ పద్మ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో దాడి చేశాడని అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న పద్మను స్థానికులు, పోలీసులు 108 ద్వారా విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
భర్త సూర్యనారాయణతో నాలుగేళ్ల క్రితం విడిపోయిన పద్మ ప్రస్తుతం హనుమాన్ జంక్షన్లోని వైష్ణవి బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు పద్మతో ఉంటున్నారు. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతన్ పరారీలో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Be the first to comment